Ashok Gehlot: పార్టీ నేతలను ఉద్దేశించి రాజస్థాన్ సీఎం గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

Few MLAs sitting with Amit Shah Ashok Gehlot swipe at Sachin Pilot on Rajasthan crisis
  • వేరొకరిని ఆమోదించడం కంటే రెబెల్ గా ఉండడమే మంచిదన్న యోచన
  • జరిగిన దానికి తాను క్షమాపణలు చెప్పినట్టు ప్రకటన
  • కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమిత్ షాతో భేటీ అయ్యారంటూ వ్యాఖ్య
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ప్రత్యర్థి సచిన్ పైలట్, ఇతర పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. ఇతరులను (సచిన్ పైలట్) ఆమోదించడం కంటే రెబెల్ గానే పోరాడడం నయమన్న ఆలోచనతో ఎమ్మెల్యేలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి గెహ్లాట్ పోటీ పడాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. ఆ సమయంలో తదుపరి సీఎం అభ్యర్థిగా సచిన్ పైలట్ తెరపైకి రావడంతో ఆయనకు వ్యతిరేకంగా, గెహ్లాట్ కు మద్దతుగా 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బెదిరించడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి గెహ్లాట్ క్షమాపణలు సైతం చెప్పుకోవాల్సి వచ్చింది.

జైపూర్ లో ఆదివారం మహాత్మాగాంధీకి గెహ్లాట్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ చరిత్రలో మొదటి సారి ఏకవాక్య తీర్మానం ఆమోదం పొందలేదు. ఇందుకు నేను విచారిస్తున్నాను. ఇందుకు క్షమాపణలు కూడా చెప్పాను. కానీ, ఎందుకని ఈ పరిస్థితి తలెత్తింది? 2020లో సంరక్షకుడిగా ఉంటానని ఎమ్మెల్యేలకు నేను హామీ ఇచ్చాను. నేను రాజస్థాన్ వీడి వెళితే తమకు ఏం జరుగుతోందోనన్న ఆగ్రహం ఎమ్మెల్యేలలో ఉంది. రాజస్థాన్ సీఎల్పీ నేతగా జరిగిన దానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను.

ఇతరులను ఆమోదించడం కంటే రెబెల్ గా ఉండడం మంచిదని ఎమ్మెల్యేల ఆలోచన. కొందరు ఎమ్మెల్యేలు అమిత్ షా, జాఫర్ ఇస్లామ్, ధర్మేంద్ర ప్రదాన్ తో భేటీ కావడం అందరికీ తెలిసిందే. ప్రభుత్వాన్ని  పడదోయాలని బీజేపీ చూస్తోందన్నది అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవాలని వారు (బీజేపీ) కోరుకోవడం లేదు’’అని గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
Ashok Gehlot
comments
Sachin Pilot
Rajasthan crisis

More Telugu News