Volksvagan: కారు ఖరీదు కంటే, దాన్ని రిపేర్ చేయడానికి రెట్టింపు అవుతుందట!

 Man gets Rs 22 lakh repair estimate for a car worth Rs 11 lakh

  • బెంగళూరు వరదల్లో దెబ్బతిన్న వాహనాలు
  • ఫోక్స్ వ్యాగన్ కారు రిపేర్ ఎస్టిమేషన్ రూ.22 లక్షలు
  • కానీ, ఆ కారు ఖరీదే రూ.11 లక్షలు
  • ఆదుకున్న బీమా సంస్థ

కారు రిపేర్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? మహా అయితే రూ.20 వేలు లేదా రూ.50 వేలు. కానీ, ఇక్కడ అలా కాదు. బెంగళూరులో ఇటీవలి వరదలకు భవనాలు, వాహనాలు రోజుల తరబడి నీటిలో మునిగి ఉండడం తెలిసిందే. దీని కారణంగా రిపేర్లకు రూ.లక్షలు కొద్దీ ఖర్చవుతోంది. అనిరుధ్ గణేశ్ కు కూడా ఇదే అనుభవం ఎదురైంది.

గణేశ్ కు చెందిన ఫోక్స్ వ్యాగన్ కారు దెబ్బతినగా, దాన్ని రిపేర్ చేసి ఇచ్చేందుకు రూ.22 లక్షలు అవుతుందంటూ వైట్ ఫీల్డ్ లోని ‘ఫోక్స్ వ్యాగన్ యాపిల్ ఆటో’ సర్వీస్ సెంటర్ ఎస్టిమేషన్ ఇచ్చింది. దీన్ని చూసి గణేశ్ తెల్లబోయాడు. ఎందుకంటే ఆ కారు కొనుగోలు ధరే రూ.11 లక్షలు. ఈ అనుభవాన్ని గణేశ్ లింక్డ్ ఇన్ లో షేర్ చేశాడు. అనంతరం గణేశ్ బీమా సంస్థ అకోను సంప్రదించాడు. కారు విలువ మొత్తం నష్టపోయినందున దాన్ని తాము వెనక్కి తీసేసుకుంటామని చెప్పింది. బీమా సంస్థ తిరిగి అతడికి అదే మోడల్ కారును అందించడంతో సమస్య పరిష్కారమైంది. 

  • Loading...

More Telugu News