Maharashtra: హలో కాదు.. వందేమాతరం అనండి.. ప్రజలకు మహారాష్ట్ర సర్కారు పిలుపు

Maha govt appeals people to say Vandemataram on phone calls instead of hello

  • వందేమాతరం అంటే తల్లికి వినమ్రంగా నమస్కరించడమని చెప్పిన ఆ రాష్ట్ర మంత్రి
  • కావాలంటే జైభీమ్‌, జైశ్రీరామ్‌ అనాలని సూచన
  • దీనిపై ప్రత్యేకంగా ప్రచారాన్ని చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం

మనం సాధారణంగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే హలో అని పలకరిస్తుంటాం. దానికి బదులు వందేమాతరం అని పలకాలని ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనితోపాటు పలు అంశాలపై వినూత్నమైన ప్రచారాన్ని ఆ రాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ వివరాలను వెల్లడించారు. హలో అనే పదం పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ఆ పదానికి ఒక అర్థమేమీ లేదని పేర్కొన్నారు. అదే వందేమాతరం అని పలకరించడం ద్వారా ఆప్యాయతా భావం పెంపొందుతుందని చెప్పారు.

కావాలంటే జైభీమ్‌, జైశ్రీరామ్‌ అనండి
వందేమాతరం అంటే తల్లి ముందు వినమ్రంగా నిలబడి నమస్కరించడమని అర్థమని పేర్కొన్నారు. కావాలంటే జైభీమ్‌, జైశ్రీరామ్‌ వంటి పదాలనుగానీ, తమ తల్లిదండ్రుల పేర్లనుగానీ చెప్పవచ్చని.. హలో అనడం మానుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అనే నినాదం ఎంతో మందిని ఆకర్షించి.. దేశ స్వాతంత్ర్యం సిద్ధించేందుకు తోడ్పడిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ కూడా వందేమాతరం నినాదానికి మద్దతు పలికారని చెప్పారు.

హలోకు బదులు వందేమాతరంకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు సర్క్యులర్‌ కూడా జారీ చేసింది. అయితే ఈ పలకరింపు తప్పనిసరి కాదని పేర్కొంది. ఉద్యోగులు ఈ విధానాన్ని అనుసరించేలా ఉన్నతాధికారులు ప్రోత్సహించాలని సూచించింది. అదే సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రయత్నించాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News