Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 638 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 207 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా నష్టపోయిన మారుతి సుజుకి షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించడంతో క్రూడాయిల్ ధరలు 4 శాతం పెరిగాయి. ఇది ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్లు నష్టపోయి 56,788కి పడిపోయింది. నిఫ్టీ 207 పాయింట్లు కోల్పోయి 16,887కి దిగజారింది. పవర్ సూచీ 3 శాతానికి పైగా నష్టపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.99%), ఎన్టీపీసీ (0.41%), భారతి ఎయిర్ టెల్ (0.21%), విప్రో (0.05%).
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-3.16%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.77%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.55%), ఐటీసీ (-2.32%), బజాజ్ ఫైనాన్స్ (-2.26%).