North Korea: మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఉత్తర కొరియా... జపాన్ మీదుగా దూసుకెళ్లేలా క్షిపణి ప్రయోగం

North Korea test fires another ballistic missile that flew over Japan

  • బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
  • జపాన్ మీదుగా వెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో పడిన వైనం
  • ప్రజలను అప్రమత్తం చేసిన జపాన్
  • సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టిన అమెరికా, జపాన్

ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు తెరలేపింది. జపాన్ గగనతలం మీదుగా దూసుకెళ్లేలా ఓ బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించింది. 

ఉత్తర కొరియాలోని గుర్తు తెలియని ప్రదేశం నుంచి గాల్లోకి లేచిన ఈ క్షిపణి 4,500 కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. అమెరికా అధీనంలోని గ్వామ్ దీవిని ఈ క్షిపణి తాకగలదని అంచనా. అమెరికా, జపాన్ లను రెచ్చగొట్టేందుకే ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు భావిస్తున్నారు. 

కాగా, ఉత్తర కొరియా క్షిపణి తన గగనతలం మీదుగా దూసుకెళ్లడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. ఈ క్షిపణి ప్రయోగం నేపథ్యంలో, ఉత్తర కొరియాకు హెచ్చరికగా జపాన్, అమెరికా దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.

  • Loading...

More Telugu News