Telangana: బీఆర్​ఎస్​ విజయవంతం కావాలి.. దేశమంతటా తెలంగాణ పథకాలు రావాలి: కుమారస్వామి

Telangana welfare scheme should be implemented all over the country says Kumaraswamy
  • తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన జేడీయూ నేత
  • కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అని ప్రశంస
  • తెలంగాణ నుంచి జాతీయ పార్టీ ఆవిర్భవించడంపై హర్షం వ్యక్తం చేసిన కుమారస్వామి
సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు అని.. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో విజయవంతం కావాలని కోరుకుంటున్నానని కర్ణాటక మాజీ సీఎం, జేడీయూ నేత హెచ్ డీ కుమారస్వామి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలని.. దేశమంతటా తెలంగాణ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తెలంగాణ భవన్ కార్యక్రమంలో ప్రసంగం

టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కుమారస్వామి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక జాతీయ పార్టీ ఆవిర్భవించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాగా అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మొదట మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై ఫోకస్ చేస్తుందని ప్రకటించడం గమనార్హం.
Telangana
BRS
TRS
Kumaraswamy
JDU
Political

More Telugu News