Facebook: ఫేస్ బుక్ లో 12 వేల మంది ఉద్యోగులపై వేటు?

12000 layoffs in Facebook
  • రాబోయే వారాల్లో ఫేస్ బుక్ లో లేఆఫ్స్
  • ముందుగానే హింట్ ఇచ్చిన యాజమాన్యం
  • తాజా నియామకాలను ఆపేశామన్న జుకర్ బర్గ్
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫేస్ బుక్ లో మాస్ లేఆఫ్స్ జరగవచ్చనే వార్త ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాలో పలు టీముల నుంచి 12 వేల మంది ఉద్యోగులను తొలగించవచ్చని ప్రచారం జరుగుతోంది. రాబోయే వారాల్లో లే ఆఫ్స్ కు అనుగుణంగా అడుగులు పడతాయని తెలుస్తోంది. 

తాజా నియామకాలను నిలిపివేశామని ఇటీవలే మెటా ఎర్నింగ్స్ కాల్ లో మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. మొత్తం 15 శాతం మంది ఉద్యోగులపై వేటు పడవచ్చని తెలుస్తోంది. మరోవైపు లే ఆఫ్స్ ఉంటాయంటూ ముందుగానే హింట్ ఇవ్వడంతో... చాలా మంది ఉద్యోగులు ప్రిపేర్డ్ గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Facebook
Lay Offs

More Telugu News