Vande Bharat Train: ప్రధాని ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్ర‌మాదం... ఇంజిన్ ముందు భాగం ఊడిపోయిన వైనం

Vande Bharat train front part was broken in an accident
  • గాంధీ న‌గ‌ర్‌- ముంబై మ‌ధ్య న‌డుస్తున్న వందే భార‌త్‌
  • 6 రోజుల క్రితం ప్ర‌ధాని ప్రారంభించిన రైలు
  • గేదెలు అడ్డు రావ‌డంతో చోటుచేసుకున్న ప్ర‌మాదం
  • సెటైర్లు సంధించిన కాంగ్రెస్, టీఆర్ఎస్‌
భార‌తీయ రైల్వేల్లో నూత‌నంగా ప్ర‌వేశ‌పెట్టిన వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ప్ర‌మాదానికి గురైంది. గ‌త వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ రైలును స్వ‌యంగా ప్రారంభించారు. ముంబై సెంట్ర‌ల్ నుంచి గుజ‌రాత్ రాజ‌ధాని గాంధీ న‌గ‌ర్ మ‌ధ్య న‌డిచే ఈ రైలు గురువారం ఉద‌యం గుజ‌రాత్‌లోని వాత్వా, మ‌ణి న‌గ‌ర్ స్టేష‌న్ల మ‌ధ్య ప్ర‌మాదానికి గురైంది. గేదెల మంద అడ్డు రాగా... గ‌మ‌నించిన లోకో పైల‌ట్ రైలుకు స‌డ‌న్ బ్రేక్ వేశారు. అయినా కూడా రైలు ఓ గేదెను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో రైలు ముందు భాగంలో ఉన్న మెట‌ల్ ప్లేట్ విరిగిపోయింది. 

ఈ ప్ర‌మాదంపై విప‌క్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించిన 6 రోజుల్లోనే వందే భార‌త్ రైలు ప్ర‌మాదానికి గురైందంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఈ ప్ర‌మాదంపై సెటైర్లు గుప్పించింది. ఇదిలా ఉంటే... ఈ ప్ర‌మాదంలో రైలు ముందు భాగం మెట‌ల్ ప్లేట్ మాత్ర‌మే విరిగింద‌ని చెప్పిన రైల్వే శాఖ‌...8 నిమిషాల్లోనే రైలు బ‌య‌లుదేరింద‌ని, గాంధీ న‌గ‌ర్‌కు స‌కాలంలోనే చేరుకుంద‌ని తెలిపింది.
Vande Bharat Train
Prime Minister
Narendra Modi
Gujarat
Train Accident
Congress
TRS

More Telugu News