Google Pixel 7: గూగుల్ స్మార్ట్ వాచ్, పిక్సల్ 7 సిరీస్ ఫోన్లు ఆవిష్కరణ

Google Pixel 7 Pixel Watch Pixel Tablet Everything announced at Google October event 2022
  • ఫ్లిప్ కార్ట్ లో పిక్సల్ 7కు ముందస్తు ఆర్డర్లు ప్రారంభం
  • ధర రూ.59,999.. డిస్కౌంట్ తర్వాత రూ.49,999
  • పిక్సల్ స్మార్ట్ వాచ్ లో రెండు రకాలు ఆవిష్కరణ
గూగుల్ పిక్సల్ 7 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. అలాగే, పిక్సల్ స్మార్ట్ ఫోన్ ను సైతం తొలిసారి తీసుకొచ్చింది. గూగుల్ పిక్సల్ ఫోన్ల కోసం ఫ్లిప్ కార్ట్ లో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. గూగుల్ పిక్సల్ 7  8జీబీ ర్యామ్, 128జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.59,999. హెచ్ డీఎఫ్ సీ కార్డులపై రూ.7,250 డిస్కౌంట్ ఆఫర్ ఉంది. పాత ఫోన్ ఎక్సేంజ్ చేస్తే రూ.16,000 వరకు తగ్గింపు ఇస్తోంది. అన్ని రకాల ఆఫర్ల తర్వాత చివరికి రూ.49,999కు దీన్ని సొంతం చేసుకోవచ్చు.

పిక్సల్ 7 ప్రో 12జీబీ ర్యామ్, 256 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 84,999. హెచ్ డీఎఫ్ సీ కార్డుపై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. అయితే, గూగుల్ పిక్సల్ 7 ప్రో కోసం ఫ్లిప్ కార్ట్ ముందస్తు ఆర్డర్లు తీసుకోవడం లేదు. పిక్సల్ 7, 7 ప్రోలో ఒకటే వేరియంట్  లభిస్తాయి. అమెరికా మార్కెట్లో గూగుల్ పిక్సల్ 7 ధర 599 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.48,000-50,000. డిస్కౌంట్ తర్వాత మన దగ్గరా అవే ధరలు అమలు చేస్తుండడాన్ని గమనించాలి.  

స్పెసిఫికేషన్లు
గూగుల్ పిక్సల్ 7 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. పిక్సల్ 7 ప్రో స్క్రీన్ సైజు కొంచెం పెద్దగా 6.7 అంగుళాలు ఉంటుంది. ఇందులో ఎల్ టీపీవో డిస్ ప్లే వాడారు. స్క్రీన్ రీఫ్రెష్ రేటు 120 హెర్జ్. ఈ రెండింటిలోనూ గూగుల్ సొంత చిప్ సెట్ టెన్సార్ జీ2 వాడారు. 

స్మార్ట్ వాచ్
గూగుల్ మొదటిసారి పిక్సల్ పేరుతో స్మార్ట్ వాచ్ ను తీసుకొచ్చింది. ఇది 4జీ ఎల్టీఈ వేరియింట్ గాను, వైఫై వేరియంట్ గాను వస్తుంది. ఎల్టీఈ వేరియంట్ ధర రూ.399 డాలర్లు. సుమారు రూ.32వేలు. వైఫై మోడల్ ధర రూ.349 డాలర్లు. రూపాయిల్లో సుమారు రూ.28వేలు. ఎక్సినోస్ 9110 చిప్ సెట్ పై పనిచేస్తుంది. ఇందులో ఎన్నో రకాల హెల్త్, ఫిట్ నెస్ ట్రాకర్ ఫీచర్లున్నాయి. 1.6 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. డిస్ ప్లేకి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. 
Google Pixel 7
Pixel 7pro
launched
flipkart
pre order

More Telugu News