air pollution: గుండె జబ్బులు పెరిగిపోవడానికి కాలుష్యం కారణమా?
- పడిపోతున్న వాయు నాణ్యత
- గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు
- బయటకు వెళితే ఎన్95 వాడుకోవాలని సూచన
కాలుష్యం నేడు మనిషిని రోగిగా మార్చేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కోరు 200 నుంచి 300 మధ్య అంటే ఆరోగ్యంపై ఓ స్థాయిలో ప్రభావం ఉంటుందని అర్థం. ఒకవేళ ఈ స్కోరు 300కు పైన ఉంటే అది హానికరం అవుతుంది. దీన్ని తీవ్ర కాలుష్యంగా పరిగణిస్తారు.
పీఎం 2.5 ధూళి కణాలు గాలిలో ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నట్టు ఓ అధ్యయనం తాజాగా కనుగొన్నది. గాలిలోని పార్టికల్ రేడియో యాక్టివిటీ వల్ల గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోందని ఈ అధ్యయనం గుర్తించింది. ఈ వివరాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో ప్రచురించారు. మసాచుసెట్స్ లో 2001 నుంచి 2015 మధ్యలో 70వేలకు పైగా మరణాలు ప్రమాదం కారణంగా జరిగినవి కావని గుర్తించారు.
వీలైనంత సమయం ఇల్లు, కార్యాలయాల్లోనే గడపడం, బయటి ప్రాంతాల్లో వ్యాయామాలు చేయకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, బయటకు వెళ్లే సమయంలో ఎన్95 లేదా పీఎం 2.5 మాస్క్ ధరిస్తే రక్షణ లభిస్తుందన్నది వారి సూచన. పొగతాగే అలవాటును కూడా మానుకోవాలని సూచిస్తున్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత 211గా ఉంది.