GodFather: రెండు రోజుల్లో ‘గాడ్ ఫాదర్’కు రూ.69 కోట్ల వసూళ్లు
- విజయదశమి రోజు విడుదలైన చిత్రం
- ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూలైన మొత్తం రూ.38 కోట్లు
- రెండో రోజు ఆదాయం రూ.31 కోట్లు
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం వసూళ్లు రెండో రోజూ ఆశాజనకంగానే ఉన్నాయి. రెండో రోజు రూ.31 కోట్లను రాబట్టుకుంది. దీంతో మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్ బాక్సాఫీసు వసూళ్లు రూ.69 కోట్లుగా ఉన్నాయి. ఈ వారంతానికి గాడ్ ఫాద్ సునాయాసంగానే రూ.100 కోట్ల ఆదాయ మార్క్ ను చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ కు రీమేక్ గాడ్ ఫాదర్.
గాడ్ ఫాదర్ మూవీ విజయదశమి రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడం గమనార్హం. మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన ఆదాయం రూ.38 కోట్లు. మోహన్ రాజా దర్శకత్వంతో వచ్చిన గాడ్ ఫాదర్ రాజకీయ, డ్రామా ఆధారితంగా ఉంటుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించాడు. అలాగే, నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. దీనికంటే ముందు చిరంజీవి నటించిన ఆచార్య బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టడం తెలిసిందే. దీంతో గాడ్ ఫాదర్ చిరంజీవి కెరీర్ కు కీలకం కానుంది.