youtube: లాన్​ లో గడ్డి కత్తిరించడానికి లేజర్​ గన్​.. చిత్రమైన ప్రయోగం చేసిన యూట్యూబర్​ వీడియో ఇదిగో

Youtuber creates Laser powered lawn mower

  • లేజర్ గన్ తయారు చేసి రోబోకు అనుసంధానం.. యూట్యూబ్ లో వైరల్ గా మారిన వీడియో..
  • 42 లక్షలకుపైగా వ్యూస్.. 70 వేలకుపైగా లైకులు కూడా..
  • ఇది ప్రమాదకరమని.. ఇళ్లలో ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని యూట్యూబర్ సూచన

విదేశాల్లో దాదాపుగా చాలా మందికి ఇళ్ల ముందో, వెనకాలో లాన్ ఉంటుంది. అందులో పెరిగే గడ్డిని ఎప్పటికప్పుడు కత్తిరించేందుకు లాన్ మోవర్ వంటి యంత్రాలు వాడుతారు. మన దేశంలోనూ పెద్ద పెద్ద హోటళ్లు, పర్యాటక ప్రదేశాలు, పార్కులు, జూలు, ఫంక్షన్ హాళ్లు వంటి వాటిలో గడ్డి కత్తిరించే లాన్ మోవర్లను వినియోగిస్తుంటారు కూడా. లాన్ మోవర్ అంటే పదునుగా ఉండే గుండ్రటి బ్లేడ్లతో కూడిన యంత్రం. అయితే ఓ యూట్యూబర్ మాత్రం గడ్డి కత్తిరించడానికి ఏకంగా లేజర్ గన్ రోబోను తయారు చేశాడు.

నిలబడి మోవింగ్ చేసే ఓపిక లేదని..
డేనియల్ రిలే అనే యూట్యూబర్ కు కొత్త ప్రయోగాలు అంటే సరదా. అదే సమయంలో తన ఇంటి వెనుక లాన్ లో గడ్డిని తొలగించడమంటే బద్ధకం. లాన్ మోవర్ ను పట్టుకుని మెల్లగా లాన్ అంతటా తిరగడం ఇష్టం లేదు. దీంతో ఓ సరికొత్త లేజర్ గన్ ను తయారు చేశాడు. అది లాన్ లో ఆటోమేటిగ్గా తిరుగుతూ గడ్డిని ఖతం చేసేలా రోబోతో అనుసంధానం చేశాడు. తీసుకెళ్లి ఈ రోబో లేజర్ గన్ ను తీసుకెళ్లి లాన్ లో పెట్టి ప్రయోగం చేశాడు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు.

సులువుగా చేసేందుకని..
‘‘ఇటీవలి కాలంలో యువత ఏ పని అయినా సులువుగా చేయాలని ఆలోచిస్తున్నారు. పెద్దగా శ్రమ లేకుండానే పని పూర్తిచేస్తున్నారు. ఇలా గడ్డిని కత్తిరించడం కూడా అలాంటి పనే. నేను స్నేహితులతో కలిసి గడపకుండా.. ఇంటి వెనకాల లాన్ మోవింగ్ ఎందుకు చేయాలి. ఆ ఆలోచనతోనే లాన్ లో గడ్డిని తొలగించే లేజర్ రోబోను తయారు చేశాను..” అని డేనియల్ రిలే చెప్పాడు.
  • అయితే ఇది చాలా ప్రమాదకరమని.. సొంతంగా ప్రయోగం చేయబోయి గాయపడొద్దని కూడా హెచ్చరించాడు. ఈ లేజర్ వల్ల చర్మంపై గాయాలు అవుతాయని, పొరపాటున కంటికి లేజర్ తగిలిందా.. కంటిచూపు శాశ్వతంగా పోతుందని స్పష్టం చేస్తున్నాడు.
  • అంతాబాగానే ఉంది గానీ.. మరి లేజర్ తో పని ఎలా జరుగుతోంది అనిపిస్తుంది కదా.. బాగా మెల్లగా. ఎంతగా అంటే లాన్ మోవర్ తో పది నిమిషాల్లో చేసే పనికి లేజర్ రోబో రెండు గంటలు తీసుకుంటోందని డేనియల్ పేర్కొన్నారు.
  • డేనియల్ రిలే యూట్యూబ్ లో పెట్టిన వీడియోకు ఏకంగా 42 లక్షలకుపైగా వ్యూస్, 70 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఇక కామెంట్లకైతే లెక్కే లేదు.
  • ఇదేదో సరికొత్త ప్రయోగం చాలా బాగుందని కొందరు ప్రశంసిస్తుంటే.. ‘జస్ట్ గడ్డిని కత్తిరించడానికి రోబోను తయారు చేయడం, లేజర్ గన్ పెట్టడం అవసరమా’ అని ప్రశ్నిస్తున్నవారూ ఎందరో.

  • Loading...

More Telugu News