Andhra Pradesh: ఈ నెల 14న ఏపీలోకి రాహుల్ యాత్ర... జోడో యాత్ర మ్యాప్‌ను డీజీపీకి అందించిన ఏపీసీసీ నేతలు
- డీ హీరేహాళ్ వద్ద ఏపీలోకి ప్రవేశించనున్న రాహుల్ యాత్ర
- ఈ నెల 14 తర్వాత 4 రోజుల పాటు యాత్రకు విరామం
- తిరిగి 18న ప్రారంభం కానున్న యాత్ర
- ఈ నెల 21న ఏపీలో యాత్రను ముగించనున్న నేత
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 14న ఏపీలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర... ఈ నెల 14న ఏపీలోని అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ కు చేరనుంది. ఏపీ, కర్ణాటక సరిహద్దు గ్రామమైన డీ హీరేహాళ్ కు చేరడంతో రాహుల్ యాత్ర ఏపీలోకి ప్రవేశించినట్లు అవుతుంది.
డీ హీరేహాళ్ నుంచి ఏపీలో ప్రారంభం కానున్న రాహుల్ యాత్ర.. ఈ నెల 21 దాకా రాష్ట్రంలోనే కొనసాగనుంది. ఈ నెల 14న జరిగే యాత్ర తర్వాత రాహుల్ తన పాదయాత్రకు 4 రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత తిరిగి 18న ఏపీలో యాత్రను కొనసాగించనున్న రాహుల్... 21 దాకా ఏపీలోనే యాత్ర సాగిస్తారు. ఈ మేరకు ఏపీసీసీ నేతలు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, రాజీవ్ రతన్‌లు శనివారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి యాత్ర రూట్‌మ్యాప్‌ను అందజేశారు.