OnePlus 10R: మంచి ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరకే వన్ ప్లస్ 10ఆర్
- అమెజాన్ పోర్టల్ పై డిస్కౌంట్ తో విక్రయం
- కార్డు డిస్కౌంట్ తర్వాత రూ.31 వేలకు అందుబాటు
- ఆల్ రౌండర్ ఫోన్ గా నిపుణుల అభివర్ణన
వన్ ప్లస్ 10ఆర్ ఫోన్ అమెజాన్ పోర్టల్ పై ఆకర్షణీయమైన ధరకు లభిస్తోంది. దీని ధర రూ.38,999 కాగా, రూ.32,999కే సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో రూ.31 వేలకు ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. టెక్ నిపుణులు దీన్ని ఆకర్షణీయమైన డీల్ గా చెబుతున్నారు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ (రామ్)తో కూడిన ఈ ఆరంభ వేరియంట్ తో 80 వాట్ ఫాస్ట్ చార్జర్ వస్తుంది. దీంతో ఫోన్ లోని 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అర గంటలోనే పూర్తి చార్జ్ చేసుకోవచ్చు. ఇక 12జీబీ ర్యామ్ వేరియంట్ రూ.37,999కి లభిస్తోంది. ఈ వేరియంట్ తో 150వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తోంది.
అయితే, రూ.31 వేలకే వస్తున్న ఆరంభ వేరియంట్ డీల్ ఆకర్షణీయంగా ఉందంటున్నారు నిపుణులు. దాదాపు అన్ని రకాల టాస్క్ లకు 8జీబీ ర్యామ్ సరిపోతుందని చెబుతున్నారు. అందుబాటు ధరకు అందించే ఉద్దేశ్యంతో వన్ ప్లస్ 10 ఆర్ ను ప్లాస్టిక్ బాడీతో తయారు చేయడం, అలర్ట్ స్లైడర్ తీసేయడాన్ని గమనించొచ్చు. ఈ ఫోన్ ను పనితీరు పరంగా ఆల్ రౌండర్ గా నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కెమెరానే ముఖ్యమని, కెమెరా కోసమే ఫోన్ కావాలనుకునే వారు షావోమీ 11టీ ప్రో లేదా ఐక్యూ9ను పరిశీలించొచ్చని సూచిస్తున్నారు.