Tollywood: ప్ర‌భాస్ మాదిరిగా బుర్రిపాలెంలో త‌ల్లి సంస్మ‌ర‌ణ స‌భ‌ ఆలోచ‌న‌లో మ‌హేష్ బాబు!

Mahesh Babu is thinking of organizing a program for his mother in Burripalem
  • గ‌త నెల 28న మ‌ర‌ణించిన మ‌హేష్ బాబు త‌ల్లి, కృష్ణ భార్య ఇందిర‌
  • శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పెద్ద‌ క‌ర్మ కార్య‌క్ర‌మం
  • కృష్ణ సొంతూరులో  ఈనెల 16న సంస్మ‌ర‌ణ స‌భ‌ నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో మ‌హేష్‌
టాలీవుడ్‌లో గ‌త నెల రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. రెబ‌ల్ స్టార్ కృష్ఱంరాజుతో పాటు సూప‌ర్ స్టార్ కృష్ఱ భార్య‌, మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిర చ‌నిపోయారు. గత నెల 11 కృష్ఱంరాజు మరణించారు. ఆయన సంస్మరణ సభను స్వగ్రామం మొగల్తూరులో నిర్వహించారు. కృష్ఱంరాజు త‌మ్ముడి కొడుకు అయిన ప్ర‌భాస్ అన్నీ తానై ఈ కార్య‌క్ర‌మాన్ని చూసుకున్నారు. దీనికి దాదాపు లక్షమందికి పైగా హాజరు అయ్యారు. కృష్ఱంరాజు మంచి భోజ‌న ప్రియుడు కావ‌డంతో ఆయ‌న సంస్మ‌ర‌ణ స‌భ‌కు వ‌చ్చిన వారందరికీ 50 రకాలకు పైగా వంటకాలతో భోజనాలు వడ్డించారు. 

ఈ విష‌యంలో మ‌హేష్ బాబు కూడా ప్ర‌భాస్ బాట‌లో న‌డ‌వాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది. కృష్ణ భార్య, మహేష్ త‌ల్లి ఇందిర గత నెల 28న మరణించ‌గా.. శనివారం ఆమె పెదకర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వ‌హించారు. ఇప్పుడు త‌న త‌ల్లి సంస్మ‌ర‌ణ స‌భ‌ను బుర్రిపాలెంలోనూ నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఈనెల 16న కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలో ఈ స్మారక కార్యక్రమం నిర్వహించబోతున్నారని స‌మాచారం. దీనికి కృష్ణ కుటుంబ సభ్యులంతా వ‌స్తార‌ని తెలుస్తోంది. అలాగే, అభిమానులంద‌రికీ ఆహ్వానం ప‌లుకుతార‌ని మ‌హేష్ స‌న్నిహితులు చెబుతున్నారు.
Tollywood
Mahesh Babu
krishna
indira
burripalem
Prabhas
krishnam raju

More Telugu News