Flipkart: 11 నుంచి ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్.. ఐఫోన్, గూగుల్ ఫోన్లపై ఆఫర్లు

Flipkart Diwali sale starts on October 11 Deals and offers on iPhone 13 Pixel 6a and more
  • 11 నుంచి 16వ తేదీ వరకు బిగ్ దీపావళి సేల్
  • కోటక్, ఎస్ బీఐ కార్డులపై 10 శాతం డిస్కౌంట్
  • పేటీఎం చెల్లింపులపైనా తగ్గింపు
  • పలు స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు
దసరా సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ ను విజయవంతంగా నిర్వహించిన ఫ్లిప్ కార్ట్... ఇప్పుడు దీపావళి సేల్ కు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 11వ తేదీ (మంగళవారం) నుంచి 16వ తేదీ వరకు బిగ్ దీపావళి పేరుతో ప్రత్యేక సేల్ ను నిర్వహించనుంది. ఫ్లిప్ కార్ట్ 'ప్లస్' సభ్యులకు ఇప్పటికే ఇది మొదలైంది. కోటక్ బ్యాంక్, ఎస్ బీఐ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 

ఇటీవలి బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అత్యధికంగా అమ్ముడుపోయినవి స్మార్ట్ ఫోన్లే. దీంతో దీపావళి సేల్ లోనూ పలు స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

నథింగ్ ఫోన్ ను రూ.26,749కు ఆఫర్ చేస్తోంది. శామ్ సంగ్ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ ఫోన్ ను రూ.33,749కే సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్ రూ.28,749కే రానుంది. మోటో జీ72 రూ.14,749కు వస్తోంది. మోటో జీ72 విక్రయాలు ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతాయి. 

ఐఫోన్ 13, 12పై మంచి డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 4కే టీవీలను రూ.17,249 నుంచి అందిస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇక మోటో జీ62 5జీ ఫోన్ రూ.16,499 నుంచి అందుబాటులో ఉంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నిచర్ పైనా ఆకర్షణీయమైన డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. పేటీఎంతో చెల్లిస్తే అదనపు తగ్గింపు ఇస్తోంది.
Flipkart
Big diwali sale
offers
discounts
iphone
google pixel

More Telugu News