badminton: చీర కట్టుకొని ట్రెండింగ్ పాటకు అంతే ట్రెండీ స్టెప్పులు వేసిన పీవీ సింధు.. వీడియో వైరల్

PV Sindhu shows off stunning dancing skills to Jiggle Jiggle song
  • జిగిల్ జిగిల్ పాటకు డ్యాన్స్ చేసిన భారత స్టార్ షట్లర్
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్
  • గాయంతో కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న తెలుగమ్మాయి
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు షటిల్ కోర్టులోనే కాకుండా బయట కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే సింధు..ఈ కాలం అమ్మాయిలా ట్రెండ్ ను ఫాలో అవుతుంది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ 'జిగిల్ జిగిల్'లో పాటకు డ్యాన్స్ చేసింది. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో నెట్ లో వైరల్ అయింది. సింధు స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సింధుకు డ్యాన్స్ అంటే ఇష్టం. 
 
ఇది వరకు కూడా ఇలాంటి వీడియోలను తను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. గత వారం జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల కోసం గుజరాత్ వెళ్లిన సింధు.. గుజరాతీ బట్టలు ధరించి సంప్రదాయ గార్బా డ్యాన్స్ చేసింది. ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం కైవసం చేసుకున్న సింధు చిన్న గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి వైదొలిగింది. తొందర్లోనే తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులోకి రావాలని చూస్తోంది. డిసెంబర్ లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో పాల్గొనేందుకు సింధు సిద్ధం అవుతోంది.
badminton
pv sindhu
dance
Jiggle Jiggle
song
Viral Videos

More Telugu News