flying taxi: దుబాయిలో ఫ్లయింగ్ ట్యాక్సీ ప్రయోగం సక్సెస్

Glimpse of future Chinese firm tests flying taxi in Dubai
  • చైనాకు చెందిన ఎక్స్ పెంగ్ సంస్థ అభివృద్ధి
  • గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
  • ఎలక్ట్రిక్ ఆధారిత వాహనం
ట్రాఫిక్ తక్కువగా ఉంటే రోడ్డుపైనే సాఫీగా సాగిపోవచ్చు. ఉన్నట్టుండి వాహనాల రద్దీ పెరిగిపోయి, జామ్ ఏర్పడితే.. అప్పుడు కూడా ఆగాల్సిన పనిలేదు. హెలికాప్టర్ మాదిరి టేకాఫ్ తీసుకుని గాలిలో ప్రయాణించొచ్చు. ఇలాంటి ఫ్లయింగ్ ట్యాక్సీని చైనాలోని గువాంగ్జు కు చెందిన ఎక్స్ పెంగ్ ఐఎన్ సీ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. పైగా ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం.

దీన్ని సోమవారం దుబాయిలో విజయవంతంగా పరీక్షించి చూశారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్లయింగ్ ట్యాక్సీకి సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉండడం గమనార్హం. అందులో ఎక్స్ పెంగ్ కూడా ఒకటి. విజయవంతంగా పరీక్షించినప్పటికీ, ఇది వెంటనే అందుబాటులోకి రావడం కష్టమే. ఇంకా చాలా రకాల పరీక్షల తర్వాతే ఇది సాధ్యపడుతుంది. అందుకు కొన్ని సంవత్సరాల సమయం కూడా తీసుకోవచ్చు.

ఎక్స్ పెంగ్ రూపొందించిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలో ఇద్దరు ప్రయాణించొచ్చు. స్లీక్ గా ఉండే ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. మనుషులు లేకుండా సోమవారం పరీక్ష నిర్వహించామని, మనిషితో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ నడిపే పరీక్షను తాము 2021 జులైలోనే పూర్తి చేసినట్టు ఎక్స్ పెంగ్ తెలిపింది. 
flying taxi
Chinese firm
developed
xpeng
tested Dubai

More Telugu News