Team India: సిరీస్ ఫలితం తేల్చనున్న మూడో వన్డే... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in third ODI
  • ఢిల్లీలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న టీమిండియా
  • దక్షిణాఫ్రికా జట్టుకు మిల్లర్ నాయకత్వం
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు మూడో వన్డే జరగనుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమవుజ్జీగా నిలిచాయి. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ సిరీస్ ఫలితం తేల్చనుంది. దాంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు చేయలేదని కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. అటు, టెంబా బవుమా గైర్హాజరీలో దక్షిణాఫ్రికా జట్టుకు సీనియర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ నాయకత్వం వహిస్తున్నాడు.
Team India
Toss
South Africa
3rd ODI

More Telugu News