Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 843 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 257 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3.70 శాతం పతనమైన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 843 పాయింట్లు నష్టపోయి 57,147కి పడిపోయింది. నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 16,983కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (1.15%), ఏసియన్ పెయింట్స్ (0.68%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.70%), నెస్లే ఇండియా (-3.13%), టాటా స్టీల్ (-2.86%), ఇన్ఫోసిస్ (-2.65%), టెక్ మహీంద్రా (-2.42%).