TDP: చింత‌కాయ‌ల విజ‌య్ క్వాష్‌ పిటిష‌న్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

ap high court dismisses chintakayala vijay quash petition

  • భార‌తి పే పేరిట పోస్టులు పెట్టారంటూ విజ‌య్‌పై సీఐడీ కేసు
  • కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విజ‌య్‌
  • సీఐడీ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాలంటూ విజయ్‌కి ఆదేశం
  • విజ‌య్‌కి సీఆర్పీసీ 41 ఏ ప్ర‌కారం నోటీసులు ఇవ్వాల‌ని సీఐడీకి ఆదేశం

టీడీపీ ఏపీ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి చింత‌కాయ‌ల విజ‌య్ క్వాష్‌ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు... త‌న‌పై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయ‌న చేసిన విజ్ఞ‌ప్తికి నిరాక‌రించింది. అంతేకాకుండా సీఐడీ అధికారులు చేప‌ట్టిన విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని విజ‌య్‌కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భార‌తి పే పేరిట  సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ విజ‌య్‌పై ఏపీ సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ కేసులో ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని విజ‌య్ ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు... ఆ స‌మ‌యంలో విజ‌య్ ఇంటిలో లేనందున ఆయ‌న డ్రైవ‌ర్‌కు నోటీసులు అంద‌జేశారు. ఈ నోటీసుల‌పై హైకోర్టును ఆశ్ర‌యించిన విజ‌య్‌...త‌న‌పై న‌మోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ సోమ‌వారం హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కేసును కొట్టివేసేందుకు నిరాక‌రించిన హైకోర్టు... విజ‌య్‌కు సీఆర్పీసీ 41 ఏ ప్ర‌కారం నోటీసులు జారీ చేయాల‌ని సీఐడీ అధికారుల‌ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News