Jagan: మాజీ ఎమ్మెల్యేపై వేటు వేసిన జగన్

Jagan suspends Ex MLA Ravi Venkata Ramana

  • పొన్నూరు వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు
  • ఎమ్మెల్యే కిలారి, మాజీ ఎమ్మెల్యే రావి వర్గాల మధ్య విభేదాలు
  • రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్

వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ కలిగించే వారిని ఉపేక్షించబోనని గతంలోనే హెచ్చరించిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ అన్నంత పని చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. 'పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు... గుంటూరు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు శ్రీ రావి వెంకటరమణ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది' అంటూ ప్రకటనలో వైసీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. 

గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి వెళ్లింది. ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వర్గం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణాపై దాడి వ్యవహారం ఇరు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచింది. ఈ క్రమంలో రావి వర్గం ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో రావి వెంకటరమణపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని, సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News