BJP: అమ‌రావ‌తిలో వ‌ర్ష‌పు నీటిలోనే విట్‌, ఎస్ఆర్ఎం వ‌ర్సిటీల‌ను సంద‌ర్శించిన సోము వీర్రాజు

bjp ap chief somu veerraju visits viyand srm versities in rain vater in amaravati
  • వ‌ర్ష‌పు నీటితో నిండిపోయిన అమ‌రావ‌తి రోడ్లు
  • అమ‌రావతి ప‌రిధిలోని విద్యా సంస్థ‌ల ప‌రిశీల‌న‌కు వెళ్లిన వీర్రాజు
  • వ‌ర్ష‌పు నీటిలో పాట్లు ప‌డుతూ ముందుకు సాగిన వైనం
  • రాజ‌ధానిలో క‌నీస మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోప‌ణ‌
బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు శుక్ర‌వారం అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా అమ‌రావతి ప‌రిధిలో ఏర్పాటైన విట్, ఎస్ఆర్ఎం, అమృత విశ్వ‌విద్యాల‌యాల‌ను సంద‌ర్శించారు. గురువారం కురిసిన వ‌ర్షానికి అమ‌రావతి ప‌రిధిలోని రోడ్ల‌న్నీ వ‌ర్ష‌పు నీటితో నిండిపోగా...ఆ నీటిలోనే ఆయ‌న నానా పాట్లు ప‌డుతూ వ‌ర్సిటీల‌ను ప‌రిశీలించారు.

ఈ సందర్భంగా వైసీపీ స‌ర్కారుపై వీర్రాజు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంలో వైసీపీ స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న ఆరోపించారు. అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన కార‌ణంగానే అమ‌రావ‌తిలో ఈ విద్యా సంస్థ‌లు త‌మ క్యాంప‌స్‌ల‌ను ఏర్పాటు చేశాయ‌న్నారు. వైసీపీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత దిగ్గ‌జ వ‌ర్సిటీల‌కు వెళ్లేందుకు కూడా వీలు కాని ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.
BJP
Andhra Pradesh
Amaravati
Somu Veerraju
SRM
VIT
AMRUTHA

More Telugu News