Ukraine: ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్లను అందించనున్న సౌదీ అరేబియా

Saudi Arabia Announces 400 Million dollars To Ukraine Amid War

  • ఏడు నెలల నుంచి రష్యా - ఉక్రెయిన్ యుద్ధం
  • దాడిని మరింత ముమ్మరం చేసిన రష్యా
  • ఉక్రెయిన్ కు అండగా నిలిచిన సౌదీ అరేబియా

రష్యా చేస్తున్న యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ కు సౌదీ అరేబియా అండగా నిలిచించి. మానవతా దృక్పథంతో ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్లను అందించబోతోంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా అధికారిక న్యూస్ ఏజెన్సీ ఎస్పీఏ వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఫోన్ చేశారని తెలిపింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడు నెలలు దాటింది. ఉక్రెయిన్ ఇంకా లొంగకపోవడంతో ఇటీవలి కాలంలో దాడిని రష్యా ముమ్మరం చేసింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అవసరమైతే అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురవుతున్నాయి.

  • Loading...

More Telugu News