USA: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త.. ఎఫ్-1 వీసాల విషయంలో భారతీయ విద్యార్థులకు పెద్దపీట

US Embassy to Release Student visas soon

  • గత విద్యా సంవత్సరంలో 82 వేల మందికి ఎఫ్-1 వీసా
  • వీసాల జారీలో భారతీయులకు పెద్ద పీట వేయాలని నిర్ణయం
  • స్లాట్లు ఏ క్షణాన్నయినా విడుదలయ్యే అవకాశం
  • విద్యార్థులు వెబ్‌సైట్ చూస్తూ ఉండాలన్న అమెరికన్ కాన్సులేట్ అధికారి

ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది శుభవార్తే. అమెరికాలో జనవరి నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి గాను వీసా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గత విద్యాసంవత్సరంలో ఏకంగా 82 వేల మంది విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు జారీ చేసిన అమెరికా ఈసారి అంతకుమించి వీసాలు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వీసా జారీ ప్రక్రియలో భారతీయ విద్యార్థులకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

రేపటి నుంచే వీసా స్లాట్లను విడుదల చేయనుంది. ప్రస్తుతం పర్యాటక, విద్యార్థి, ఇతర వీసాల కోసం 400 రోజులకుపైగా ఎదురుచూడాల్సి వస్తోంది. మరోవైపు, అక్టోబరులో కొన్ని, నవంబరు రెండోవారంలో మరికొన్ని విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేయనున్నట్టు అమెరికా రాయబార కార్యాలయంలోని మినిస్టర్ కాన్సులర్ హెఫ్లిన్ ఇప్పటికే ప్రకటించారు. స్లాట్లు ఏ క్షణాన్నయినా విడుదల అవుతాయని, కాబట్టి విద్యార్థులు తరచూ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News