Mahesh Babu: మహేష్‌–త్రివిక్రమ్ చిత్రం.. ఈసారి రెండు ‘అ’లు వచ్చేలా టైటిల్!

A sentiment continues Mahesh and trivikram next movie
  • ‘అయోధ్యలో అర్జునుడు’ టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు
  • ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన రెండు చిత్రాలు
  • తాజా చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి.. తొందర్లో రెండో షెడ్యూల్
టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వచ్చిన ‘అతడు’ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ‘ఖలేజా’ చిత్రం కమర్షియల్ గా ఆ స్థాయిలో హిట్ అవకపోయినా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. దీనికి ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్‌కి ‘అ’ సెంటిమెంట్‌ ఉంది. తన చిత్రాలకు ‘అ’ అక్షరంతో మొదలయ్యే పేర్లు పెడుతుంటారు. మహేష్ తో ‘అతడు’, జూనియర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’, నితిన్ తో ‘అ ఆ’, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురము’ తీసి భారీ హిట్స్ సాధించి పెట్టాడు త్రివిక్రమ్. 

ఇప్పుడు కూడా తన సెంటిమెంట్ ప్రకారం మహేష్ తాజా చిత్రం కోసం అ అక్షరం సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఒకటి కాకుండా రెండు ‘అ’ లు వచ్చేలా ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా త్రివిక్రమ్ మార్క్‌తో ఉండే యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ అని సమాచారం. ఇందులో మహేష్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా కనిపిస్తాడరట. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. మహేష్ తల్లి ఇందిరా దేవి చనిపోవడంతో రెండో షెడ్యూల్ ఆసల్యం అవుతోంది. ప్రస్తుతం విదేశాలకు వెళ్తున్న మహేష్ తిరిగొచ్చిన తర్వాత తొందర్లోనే రెండో షెడ్యూల్ మొదలు పెట్టాలని చూస్తున్నారు.
Mahesh Babu
Trivikram Srinivas
Tollywood
movie
a
sentiment

More Telugu News