T20 World Cup: టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో లంకపై నమీబియా గెలుపు

Namibia wins over srilanka in t20 world cup first match
  • ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్
  • తొలి మ్యాచ్ లో శ్రీలంక, నమీబియాల మధ్య పోరు
  • 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసిన నమీబియా
  • 108 పరుగులకే ఆలౌట్ అయిన లంక
టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ ఆదివారం ప్రారంభమైపోయింది. ఈ సన్నాహక మ్యాచ్ లలో భాగంగా ఆదివారం శ్రీలంక, నమీబియాల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియాలోని గీలాంగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుని... నమీబియాను ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి నమీబియా 163 పరుగులు చేసింది. 

ఆ తర్వాత 164 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక... 19 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. లంక ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇవ్వడంలో విఫలం కాగా... ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. వెంటవెంటనే వికెట్లు పడిపోగా... 19 ఓవర్లు ముగిసేసరికి 10 వికెట్లు కోల్పోయిన లంక... కేవలం 108 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా నమీబియా చేతిలో లంక 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
T20 World Cup
Srilanka
Namibia

More Telugu News