TDP: చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే... వీడియో విడుదల చేసిన టీడీపీ

tdp posts a video of ysrcp mla venkate gowda attends to karnataka court on cheque bounce case
  • పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్న వెంకటే గౌడ
  • చెక్ బౌన్స్ కేసులో కర్ణాటక కోర్టుకు హాజరైన వైనం
  • మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారంటూ టీడీపీ సెటైర్లు
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ సోమవారం ఓ కేసు నిమిత్తం కర్ణాటకలోని ఓ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను అక్కడి మీడియా ప్రతినిధులు కోర్టు ఆవరణలోనే పలు ప్రశ్నలు సంధించారు. మీడియా ప్రశ్నలకు నవ్వుతూనే సమాధానం చెబుతూ నిలుచున్న వెంకటే గౌడ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే అక్కడి నుంచి బయలుదేరారు. ఈ విజువల్స్ తో కూడిన వీడియోను టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసింది.

మోసం చేయడం వైసీపీ నేతల ప్రథమ అర్హత అని... సీఎం జగన్ నుంచి పార్టీ కార్యకర్త వరకు ఏదో ఒక నేరంతో కోర్టు మెట్లు ఎక్కేవారేనని ఆ వీడియోకు టీడీపీ తన కామెంట్ ను జత చేసింది. పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్న వెంకటే గౌడ చెక్ బౌన్స్ కేసులో ముద్దాయిగా కర్ణాటకలో కోర్టుకు హాజరయ్యారని, మీడియా వెంటబడితే నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారని కూడా టీడీపీ సెటైర్లు సంధించింది.
TDP
YSRCP
Chittoor District
Palamaneru MLA
Venkate Gowda
Karnataka
Cheque Bounce Case

More Telugu News