Suresh Raina: పాకిస్థాన్ ను ఓడిస్తే టీ20 ప్రపంచ కప్ మనదే: సురేశ్ రైనా

If India wins against Pakistan T20 world cup will be ours says Suresh Raina
  • ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్
  • ఈ నెల 23న భారత్, పాక్ ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్
  • టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉందన్న రైనా
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ లు ఫేవరెట్లుగా ఉన్నాయి. వీటితో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకు కూడా టోర్నీని గెలిచే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టోర్నీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఈ నెల 23వ తేదీపైనే ఉంది. ఎందుకంటే, ఆరోజు హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా-పాక్ లు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పాకిస్థాన్ తో తలపడే తొలి మ్యాచ్ లో గెలిస్తే టీ20 వరల్డ్ కప్ మనదే అని సురేశ్ రైనా చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉందని... షమీ, అర్షదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ మనకు ఉన్నారని తెలిపాడు. కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నాడని... రోహిత్ శర్మ సమర్థవంతమైన కెప్టెన్ అని చెప్పారు. పాక్ తో జరిగే తొలి మ్యాచ్ లో గెలిస్తే... మన టీమ్ విశ్వాసం అమాంతం పెరుగుతుందని అన్నాడు. దేశంలోని ప్రతి ఒక్కరూ టీమ్ గెలుపు కోసం ప్రార్థనలు చేస్తున్నారని... ఈ ప్రపంచ కప్ ను టీమిండియా తప్పకుండా గెలవాలని తాను కూడా గట్టిగా కోరుకుంటున్నానని చెప్పాడు.
Suresh Raina
Team India
T20 World Cup
India
Pakistan

More Telugu News