WhatsApp: వాట్సాప్ లో ఇవి చేయకండి.. అకౌంట్ బ్లాక్ అయిపోతుంది
- యూజర్ల ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తున్న వాట్సాప్
- అవాస్తవ సందేశాలను వ్యాప్తి చేస్తే చర్యలు
- సందేశం స్వీకరించిన వారు రిపోర్ట్ చేస్తే ఖాతా బ్లాక్
యూజర్ల ప్రైవసీ పరిరక్షణకు వాట్సాప్ ఎప్పటికప్పుడు ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉంటుంది. మరింత భద్రతతో కూడిన అప్ డేటెడ్ వెర్షన్లను అందిస్తుంటుంది. అలాగే, యూజర్లకు సైతం నియమ, నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటిని ఉల్లంఘిస్తే వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. వాట్సాప్ అకౌంట్ యూజర్లు స్పామ్, స్కామ్ లలో పాలు పంచుకున్నా, లేదంటే నిబంధనలను ఉల్లంఘించినా వారి ఖాతాను బ్లాక్ చేస్తుంది. ఈ ఏడాది ఆగస్ట్ లో ఇలానే వాట్సాప్ 23 లక్షల ఖాతాలను భారత్ లో బ్లాక్ చేసింది.
- మీకు ఏదైనా మెస్సేజ్ లేదా ఇమేజ్ వచ్చిందనుకోండి. అందులో నిజా, నిజాలు తెలుసుకోకుండా వేరొకరికి ఫార్వార్డ్ చేయకండి. వాట్సాప్ లో ఏదైనా ఒకేసారి ఐదు మందికి మించి ఫార్వార్డ్ చేయలేరు. ఎందుకంటే ఇదొక గేట్ వే అనుకోవాలి. కావాలంటే మరో విడత మరో ఐదుగురికి చొప్పున సందేశాలు పంపించుకోవచ్చు. కానీ, ఈ నిబంధన యూజర్లను అప్రమత్తం చేసేందుకే. కనుక అవాస్తవాల ప్రచారంలో భాగం కావద్దు.
- ఆటోమేటెడ్ లేదా బల్క్ మెస్సేజ్ లను పంపించొద్దు. వాట్సాప్ మిమ్మల్ని స్పామ్ స్టర్ గా గుర్తిస్తుంది. వాట్సాప్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ వాడుతుంది. పైగా మొదటిసారి ఒక కాంటాక్ట్ నుంచి ఏదైనా సందేశం వస్తే.. స్పామ్, బ్లాక్ చేయాలా? అని యూజర్ ని వాట్సాప్ అడుగుతుంది. యూజర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా విశ్లేషించి చర్యలు తీసుకుంటుంది.
- బ్రాడ్ కాస్ట్ మెస్సేజ్ లను తరచుగా పంపించొద్దు. ఇలా చేస్తే మెస్సేజ్ లు అందుకున్న వారు రిపోర్ట్ చేయవచ్చు. అప్పుడు అకౌంట్ బ్లాక్ అయిపోతుంది.
- మెస్సేజ్ పంపించొద్దని ఎవరైనా అభ్యంతరం పెడితే వారికి పంపకుండా ఉండడమే నయం. ఎందుకంటే అవతలి యూజర్ రిపోర్ట్ చేశారంటే మన ఖాతాపై వేటు పడుతుందని గుర్తు పెట్టుకోవాలి.
- వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించొద్దు. తప్పుడు సందేశాలు, చట్టవిరుద్ధమైన చర్యలు, వ్యక్తులు, సంస్థల పరువుకు భంగం కలిగించే పనులకు వాట్సాప్ ను వేదికగా చేసుకున్నా ఖాతా బ్లాక్ అవుతుంది.