T20 World Cup: గవాస్కర్ లెక్కల్లో... టీ20 వరల్డ్ కప్ టైటిల్ పోరు ఈ రెండు జట్ల మధ్యేనట!

Sunil Gavaskar predicts t20 world cup finals between team india and australia
  • ఇప్పటికే మొదలైపోయిన టీ20 వరల్డ్ కప్
  • మెగా టోర్నీ కోసం ఆస్ట్రేలియా చేరిన గవాస్కర్
  • భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఫైనల్ జరుగుతుందని అంచనా
  • గవాస్కర్ అంచనాతో ఏకీభవించిన టామ్ మూడీ
క్రికెట్ లవర్స్ ను సుదీర్ఘ కాలంగా ఊరిస్తున్న టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైపోయింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం సన్నాహక మ్యాచ్ లే జరుగుతున్నా... పసికూనల్లాంటి జట్లు మేటి జట్లను చిత్తు చేస్తూ సంచలన విజయాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీలో టైటిల్ పోరుకు చేరే జట్లు ఏవన్న విషయంపై టీమిండియా మాజీ దిగ్గజం లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన అంచనాను వెల్లడించారు.

టీ20 వరల్డ్ కప్ టోర్నీ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా చేరిన గవాస్కర్... ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఫైనల్ చేరడం ఖాయమని చెప్పారు. టైటిల్ పోరుకు చేరే భారత్... ఆ మ్యాచ్ లో ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుందని తెలిపారు. ఆట తీరు పరంగా భారత్ ఫైనల్ చేరుతుందన్న గవాస్కర్... తాను ఆస్ట్రేలియాలో ఉన్నాను కాబట్టి ఫైనల్ కు చేరే మరో జట్టుగా ఆస్ట్రేలియా పేరును చెబుతున్నానని అన్నారు. గవాస్కర్ అంచనాతో ఆసిస్ దిగ్గజ క్రికెటర్ టామ్ మూడీ కూడా ఏకీభవించాడు.
T20 World Cup
Team India
Australia
Sunil Gavaskar

More Telugu News