Posani Krishna Murali: వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే దాస్ బహిష్కరణ

ysrcp expels ex mla d y das

  • 2009లో పామర్రు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాస్
  • ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వైనం
  • 2019 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరిక
  • పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న వైసీపీ

ఏపీలో అధికార పార్టీ వైసీపీ మరో నేతపై వేటు వేసింది. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవరి ఏసు దాస్ (డీ వై దాస్)ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ వైసీపీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీ వై దాస్ పై బహిష్కరణ వేటు వేసినట్లు వైసీపీ తన ప్రకటనలో పేర్కొంది.

పామర్రు నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దాస్... ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా దాస్ పై ఫిర్యాదులు వచ్చినట్లు వైసీపీ తెలిపింది. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి పార్టీ అధినేతకు నివేదిక అందించగా... దాస్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని జగన్ ఆదేశించినట్లుగా వైసీపీ తన ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News