Azizuddin: మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు పితృవియోగం

Former captain Mohammed Azharuddin father Azizuddin dies of prolonged illness
  • అజారుద్దీన్ తండ్రి అజీజుద్దీన్ కన్నుమూత
  • ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న అజీజుద్దీన్
  • గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స
  • రేపు అంత్యక్రియల నిర్వహణ   
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. అజారుద్దీన్ తండ్రి అజీజుద్దీన్ కన్నుమూశారు. అజీజుద్దీన్ సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. అజీజుద్దీన్ మరణంలో అజర్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాగా, అజర్ తండ్రి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ లోని మసీదులో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Azizuddin
Azharuddin
Demise
Cricket
India

More Telugu News