Congress: శశిథరూర్ రిగ్గింగ్ వ్యాఖ్యలపై సాయిరెడ్డి సెటైర్లు.. వైసీపీలో అధ్యక్ష ఎన్నికలెక్కడ? అంటూ జైరాం రమేశ్ చురక

congress leader jairam ramesh satires on ysrcp mp vijay sai reddy tweet
  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సాయిరెడ్డి ట్వీట్
  • శశిథరూర్ కాస్తంత జాగ్రత్తగా ఉండాలంటూ సెటైర్
  • రెడ్డిగారూ... అంటూ వ్యంగ్యాస్త్రం సంధించిన జైరామ్ రమేశ్
బుధవారం ముగిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై సెటైర్లు సంధిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే చేతిలో శశిథరూర్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ శశిథరూర్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన ఖర్గేకు శుభాకాంక్షలు చెబుతూ... ఖర్గేతో కలిసి పని చేస్తానని కూడా చెప్పారు.

శశిథరూర్ చేసిన రిగ్గింగ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సాయిరెడ్డి ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. శశిథరూర్ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయని, అయినా కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తుందన్న విషయం థరూర్ కు తెలియనట్టుంది అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అనుభవశీలి అయిన థరూర్ ఎన్నికల పేరిట కాంగ్రెస్ ఆడే గేమ్ పై జాగ్రత్తగా ఉండాలంటూ సలహాలు ఇచ్చారు. సాయిరెడ్డి ట్వీట్ ను చూసినంతనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సెటైర్లతో కూడిన ట్వీట్ సంధించారు. కాంగ్రెస్ తరహా అధ్యక్ష ఎన్నికలను వైసీపీలో ఎందుకు యత్నించలేదు రెడ్డి గారూ? అంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు.
Congress
YSRCP
Vijay Sai Reddy
Jairam Ramesh
Shashi Tharoor

More Telugu News