Tanuku: తణుకులో నారా లోకేశ్ సమక్షంలో వంది మందికి పైగా టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

More than 100 YSRCP followers of Tanuku joins TDP in presence of Nara Lokesh
  • మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు
  • కార్యక్రమానికి హాజరైన అచ్చెన్నాయుడు
  • వైసీపీ పతనం మొదలైందన్న నారా లోకేశ్
తణుకులో వైసీపీకి చెందిన వంద మందికి పైగా నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వీరు టీడీపీలో చేరారు. వీరంతా తణుకు రూరల్ మండలం తేతలి, ఇరగవరం, సూరంపూడి గ్రామాలకు చెందినవారు. టీడీపీలో చేరిన వారిలో మట్టా వెంకట్, మట్టా నాగేశ్వరరావు, కట్టా శ్రీరామమూర్తి, భూపతిరాజు, వెంకటరామరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... అవినీతి, అరాచక విధానాలతో వైసీపీ పతనం మొదలైందని అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
Tanuku
ysrcp
Telugudesam
Nara Lokesh
Atchannaidu

More Telugu News