Buggana Rajendranath: మాతో తప్ప టీడీపీ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది: బుగ్గన

so far TDP has alliance with every party says Buggana
  • టీడీపీ పొత్తు పెట్టుకోని పార్టీ లేదన్న బుగ్గన
  • వైసీపీ నేతలపై పవన్ వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య
  • రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓపిక ఉండాలని హితవు
ఇప్పటి వరకు తెలుగుదేశం పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ లేదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుందని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయమేనని చెప్పారు. 2014 నుంచి అసెంబ్లీలో టీడీపీ నేతలు ఎలాంటి భాషను ఉపయోగించారో అందరికీ తెలుసని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని... రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓపిక ఉండాలని హితవు పలికారు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని బుగ్గన తెలిపారు. ఎగుమతుల్లో 4వ స్థానంలో ఉన్నామని చెప్పారు. అభివృద్ధి కోసం తెచ్చిన అప్పులను ఏనాడూ దాచిపెట్టలేదని అన్నారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల అసమానతలు వచ్చాయని... అందువల్లే మూడు రాజధానులను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని చెప్పారు.
Buggana Rajendranath
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News