Andhra Pradesh: పదవి దక్కిన 2 రోజులకే విదేశీ పర్యటనకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే భర్త

ap government advisor aluru sambasiva reddy is in germany tour
  • ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆలూరు
  • రెండు రోజులకే విదేశీ పర్యటనకు వెళ్లిన వైసీపీ నేత
  • రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రతినిధి బృందంతో కలిసి జర్మనీ వెళ్లిన వైనం
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నేత ఆలూరు సాంబశివారెడ్డి ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. విద్యా శాఖలో సలహాదారుగా జగన్ సర్కారు ఆయనను నియమించగా... ఆ మరునాడే పదవీ బాధ్యతలు చేపట్టిన సాంబశివారెడ్డి...ఆ మరునాడే విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఏపీ ఉన్నత విద్యా శాఖ ప్రతినిధి బృందం బుధవారం జర్మనీ పర్యటనకు వెళ్లింది. ఈ బృందంలో సాంబశివారెడ్డి కూడా ఉన్నారు. 

జర్మనీ విద్యా శాఖతో చర్చల నిమిత్తం ఏపీ ఉన్నత విద్యా శాఖ ప్రతినిధి బృందం ఆ దేశ పర్యటనకు వెళ్లింది. విద్యకు సంబంధించి పలు కీలక అంశాలపై ఇరు వర్గాలు చర్చలు జరపనున్నాయి. ఈ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సాంబశివారెడ్డి కీలక భూమిక పోషించనున్నారు. అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జొన్నలగడ్డ పద్మావతి భర్తే ఆలూరు సాంబశివారెడ్డి అన్న సంగతి తెలిసిందే.
Andhra Pradesh
YSRCP
Jonnalagadda Padmavathy
Aluru Sambasiva Reddy
Germany

More Telugu News