HCL: రోజుకు రూ. 3 కోట్లు విరాళంగా ఇచ్చేస్తున్న శివ్ నాడార్.. దాతృత్వంలో మేటి!

With Rs 3 crore a day donations HCL founder Shiv Nadar named most generous Indian

  • దాతృత్వ జాబితా విడుదల చేసిన హురూన్ ఇండియా
  • ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 1161 కోట్లను విరాళంగా ఇచ్చిన శివ్ నాడార్
  • మూడో స్థానంలో ముకేశ్ అంబానీ, ఏడో స్థానంలో గౌతమ్ అదానీ
  • దాతృత్వ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడిగా నిఖిల్ కామత్

రోజుకు 3 కోట్ల చొప్పున విరాళం ఇస్తూ దాతృత్వం విషయంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (77). ఆయన ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1161 కోట్ల వరకు విరాళంగా అందించినట్టు ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా పేర్కొంది. 

హురూన్ తాజాగా విడుదల చేసిన దాతృత్వ జాబితాలో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ (77) రూ. 484 కోట్ల విరాళం ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయంలో అజీమ్ ప్రేమ్ జీ గతంలో వరుసగా రెండేళ్లు అగ్రస్థానంలో నిలిచారు. రూ. 411 కోట్ల విరాళంతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 

రూ.242 కోట్లతో బిర్లా కుటుంబం నాలుగో స్థానంలో నిలవగా, దేశంలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ (60) రూ.190 కోట్లతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. సుస్మిత సుబ్రతో బాగ్చి (రూ. 213 కోట్లు), రాధా, ఎన్ఎస్ పార్థసారథి (రూ.213 కోట్లు) ఐదారు స్థానాల్లో నిలిచారు. అనిల్ అగర్వాల్ కుటుంబం (రూ.165 కోట్లు), నందన్ నీలేకని (రూ. 159 కోట్లు), ఎ.ఎం నాయక్ (రూ.142 కోట్లు)తో వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచారు. జెరోధాకు చెందిన నితిన్ కామత్, నిఖిల్ కామత్ తమ విరాళాలను 300 శాతం పెంచి రూ. 100 కోట్లకు చేర్చారు. 36 ఏళ్ల నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు కావడం విశేషం.

  • Loading...

More Telugu News