Kangana Ranaut: 'కాంతారా' చూశాను.. ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది: కంగనా రనౌత్

My body is still shaking says Kangana Ranaut after watching Kantara Movie
  • ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మరో కన్నడ చిత్రం 'కాంతారా'
  • సినిమా అంటే ఇలా ఉండాలి అన్న కంగన
  • మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి బయటకు రాలేనేమో అని వ్యాఖ్య
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతారా' సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సంచలనంగా మారింది. ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిందీలో సైతం ఈ సినిమా దుమ్ము రేపుతోంది. ఈ సినిమాను చూసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ఆమె స్పందిస్తూ.. తన కుటుంబసభ్యులతో కలిసి ఇప్పుడే సినిమా చూశానని... ఇప్పటికీ తన శరీరం వణుకుతోందని అన్నారు. ఈ చిత్రాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభవమని చెప్పారు. జానపద కథలు, సంప్రదాయాలు, దేశీయ సమస్యల కలయికే ఈ సినిమా అని అన్నారు. 

'రిషబ్ శెట్టి నీకు హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం, నటన, యాక్షన్ అంతా అద్భుతం. నమ్మలేకపోతున్నా. అందమైన ఫొటోగ్రఫీ, యాక్షన్, థ్రిల్లర్. సినిమా అంటే ఇలా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూడాలంటే ఇలా ఉండాలి. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాను చూడలేదంటూ కొందరు ప్రేక్షకులు సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ అనుకుంటుండటం నేను విన్నాను. ఇలాంటి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటకు రాలేననే అనుకుంటున్నా' అని కంగన తన ఇన్స్టా స్టోరీస్ లో పేర్కొంది.
Kangana Ranaut
Bollywood
Kantara Movie
Rishab Shetty

More Telugu News