tennis: డోప్ టెస్టులో పట్టుబడ్డ ప్రపంచ మాజీ నెంబర్ 1 టెన్నిస్ స్టార్

Former World No 1 Simona Halep provisionally suspended for doping
  • రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ పై తాత్కాలిక సస్పెన్షన్ వేటు
  • తాను ఏ తప్పూ చేయలేదంటున్న హలెప్
  • సస్పెన్షన్ పై  న్యాయ పోరాటం చేస్తానని వెల్లడి
తన ఆటతో పాటు అందంతో అభిమానులను ఆకట్టుకుంటున్న రొమేనియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ వివాదంలో చిక్కుకుంది. నిషేధిత ఉత్ర్పేరకాలు వాడినందుకు ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ విదించింది. ఈ ఏడాది న్యూయార్క్ లో జరిగిన యూఎస్ ఓపెన్ సమయంలో హలెప్ నుంచి సేకరించిన రెండు శాంపిల్స్ ను పరీక్షించి ఆమె డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు గుర్తించారు. ఆమె శాంపిల్స్ లో  రోక్సాడుస్టాట్ అనే డ్రగ్ ఉన్నట్టు తేలింది. ఈ డ్రగ్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నిషేధిత జాబితాలో ఉంది. 

శాంపిల్ లో చాలా తక్కువ పరిణామంలో డ్రగ్ ఉండటంతో హలెప్ పై ప్రస్తుతానికి ప్రాధమిక నిషేధం మాత్రమే విధించారు. ఈ చర్యతో హలెప్ ఆశ్చర్యానికి గురైంది. ఇది తన జీవితంలో అతి పెద్ద షాక్ అని ఆమె పేర్కొంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది. తన  కెరీర్ మొత్తంలో ఎప్పుడూ  మోసం చేయాలనే ఆలోచన ఒక్కసారి కూడా రాలేదని తెలిపింది. నిషేధిత డ్రగ్ తన శరీరంలోకి ఎలా వెళ్లిందో తెలియడం లేదని చెప్పింది. తాను ఎలాంటి డ్రగ్ తీసుకోలేదని నిరూపించుకోవడానికి చివరి వరకూ న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించింది.
tennis
world no 1
simona halep
suspend
drug test

More Telugu News