Congress: దేవదాసీ మహిళలతో రాహుల్ గాంధీ ఆత్మీయ సమావేశం

rahul gandhi meets devadasis at raichur in karnataka
  • రాయచూర్ పరిధిలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర
  • రాహుల్ ను కలిసేందుకు వచ్చిన దేవదాసీలు
  • దేవదాసీల సమస్యలను పరిష్కారిస్తామని రాహుల్ హామీ 
భారత్ జోడో యాత్రలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ... ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతంలో ఉన్నారు. రేపటితో కర్ణాటకలో యాత్ర ముగించనున్న ఆయన తెలంగాణలోకి అడుగుపెట్టనున్నారు. యాత్రలో భాగంగా పలు వర్గాల ప్రజలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న రాహుల్... ఆయా వర్గాల సమస్యలు, వాటి పరిష్కారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా శనివారం రాయచూర్ పరిసరాల్లో దేవదాసీ మహిళలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన పలువురు దేవదాసీలు యాత్రా శిబిరానికి రాగా... వారితో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలపై వారు ఇచ్చిన వినతి పత్రాన్ని రాహుల్ పరిశీలించారు. తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకునే దిశగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుంటున్నామని, ఈ క్రమంలో ఓ జట్టుగా చేరి ఆర్థికంగా కొంతమేర వృద్ధి సాధించామని చెప్పారు. వారి కృషి, పట్టుదలను మెచ్చుకున్న రాహుల్ గాంధీ పార్టీ తరఫున వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని చెప్పారు.
Congress
Karnataka
Bharat Jodo Yatra
Rahul Gandhi
Devadasi
MGNREGA
Raichur

More Telugu News