biryani: బిర్యానీ తింటే లైంగిక పటుత్వం తగ్గుతుందంటూ బిర్యానీ సెంటర్లను బలవంతంగా మూయించిన మాజీ మంత్రి

Biryani spices reducing male sex drive says TMC leader forces shops to shut down in Bengal

  • బెంగాల్ లోని కూచ్ బెహార్ లో రెండు బిర్యానీ సెంటర్లను 
    మూసివేయాలని బలవంతం
  • బిర్యానీలో వాడే మసాలాలతో పురుషుల్లో పటుత్వం తగ్గుతుందంటున్న టీఎంసీ నాయకుడు
  • ఈ మేరకు కొంత మంది ఫిర్యాదు చేశారని వ్యాఖ్య

పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు రవీంద్ర నాథ్ ఘోష్ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లోని రెండు స్థానిక బిర్యానీ షాపులను మూసి వేయమని బలవంతం చేశారు. బిర్యానీలో ఉపయోగించే మసాలాల వల్ల మగవారిలో లైగింక పటుత్వం తగ్గుతోందని ఆరోపిస్తూ ఈ పని చేయడం చర్చనీయాంశమైంది. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రవీంద్ర నాథ్ మాట్లాడుతూ, బిర్యానీ చేయడానికి ఉపయోగించే పదార్థాలు, మసాలాలతో మగవాళ్లలో శృంగారంపై కోరికలు తగ్గినట్టు చాలా మంది నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. 

‘బిర్యానీ చేయడానికి ఏ మసాలాలు ఉపయోగిస్తున్నారో తమకు తెలియదని ఈ ప్రాంత ప్రజలు కొన్నాళ్ల నుంచి చెబుతున్నారు. వాటివల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతోందని ఆరోపిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఈ ప్రాంతంలో బిర్యానీ విక్రయిస్తున్నారని, లైసెన్సు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నారని కూచ్ బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ అయిన రవీంద్రనాథ్ తెలిపారు. ఫిర్యాదుల అనంతరం ఇక్కడికి వచ్చి చూడగా షాపులకు ట్రేడ్ లైసెన్స్ లేదని, అందుకే దుకాణాలు మూసేశామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News