Uttar Pradesh: దుకాణాలను ధ్వంసం చేసిన మాజీ ఐఏఎస్ కుమార్తె.. కేసు నమోదు

Ex IAS attacks road side vendors

  • లక్నోలోని గోమతి నగర్ లో ఘటన
  • రోడ్డు పక్కన పండుగ సామగ్రిని అమ్ముకుంటున్న వారిపై యువతి దాడి
  • దీపాలు, కుండీలు, ఇతర వస్తువులను దాడి చేసిన వైనం

సమాజానికి దశాబ్దాల పాటు సేవ చేసిన ఉన్నతాధికారి కూతురు అయినప్పటికీ... ఓ యువతి విచక్షణ మరిచి, అహంకారంతో రెచ్చిపోయింది. తన ఇంటి ముందు ఉన్న దుకాణాలపై దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లక్నో గోమతి నగర్ లో దీపావళి సందర్భంగా కొందరు స్థానిక వ్యాపారులు కాలనీ రోడ్డు పక్కన పండుగ సామగ్రిని అమ్ముకుంటున్నారు. అయితే, తమ ఇంటి ముందు దుకాణాలు ఎందుకు పెట్టుకున్నారంటూ మాజీ ఐఏఎస్ అధికారి కూతురు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తొలగించాలని వారితో వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగకుండా దుకాణాలపై దాడి చేసింది. దీపాలు, కుండీలు, ఇతర వస్తువులను కర్రతో పగులగొట్టింది. 

ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక ఐఏఎస్ అధికారి కూతురు అయ్యుండి వీధి వ్యాపారులపై ఇలా ఎలా దాడి చేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, దుకాణాలను ధ్వంసం చేసినందుకు ఆమెపై పోలీసులు 427, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News