Anantapur District: జోగినిల మధ్య అనంతపురం జిల్లా ఎస్పీ దీపావళి వేడుకలు... వీడియో ఇదిగో

ananthapus sp fakkeerappa celebrates diwali with jogini ladies
  • అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఫకీరప్ప
  • దీపావళి పర్వదినాన శెట్టూరులోని జోగినిల వద్దకు వెళ్లిన వైనం
  • జోగినిల ఇళ్లకు శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయించిన ఎస్పీ
అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఫకీరప్ప మరోమారు వార్తల్లో నిలిచారు. దీపావళి పర్వదినాన ఆయన సామాజిక దురాగతానికి బలైన జోగినిల మధ్య వేడుకలు జరుపుకున్నారు. అంతేకాకుండా జోగినిల ఇళ్లకు యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేయించారు. 

దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి అనంతపురం జిల్లాలోని శెట్టూరులో ఉంటున్న జోగినిల ఇళ్లకు ఫకీరప్ప వెళ్లారు. ఆ తర్వాత జోగినిలతో కలిసి ఆయన దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
Anantapur District
Fakkeerappa IPS
Jogini
Diwali

More Telugu News