Komatireddy Raj Gopal Reddy: జ్వరం బారిన పడ్డారన్న ప్రచారంపై ఘాటు రిప్లై ఇచ్చేసిన రాజగోపాల్ రెడ్డి

rajagopal reddy strong reply to trs and congress posts over his fever
  • రాజగోపాల్ రెడ్డి జ్వరం పేరిట నాటకాలాడుతున్నారని వైరి వర్గాల పోస్టులు
  • తన పాత ఫొటోతో దుష్ప్రచారం చేస్తున్నారన్న రాజగోపాల్ రెడ్డి
  • టీఆర్ఎస్, కాంగ్రెస్ పోస్టులపై ధ్వజమెత్తిన బీజేపీ అభ్యర్థి
మునుగోడు ఉప ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఆ తూటాలు ఘాటు వ్యాఖ్యలను మించిపోయిన బూతుల పర్వాన్ని వల్లిస్తున్నాయి. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... జ్వరం బారిన పడ్డారంటూ ఇటు టీఆర్ఎస్ తో పాటు అటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై ఘాటుగా రిప్లై ఇచ్చారు. పాత ఫొటోలతో అసత్య ప్రచారానికి దిగుతున్నారంటూ ఆయన ఆ రెండు పార్టీలపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి లాగా దొంగ దాడులు, కేసీఆర్ లాగా దొంగ దీక్షలు ఎవరూ చేయలేరని ఆయన సెటైర్లు సంధించారు.  

గతంలో తాను మెడికల్ చెకప్ చేయించుకున్న సందర్భంగా తీసుకున్న ఫొటోను పట్టుకుని తనకు జ్వరం వచ్చిందంటూ టీఆర్ఎస్ దుష్ప్రచారానికి పాల్పడుతోందంటూ రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలర్స్ గా కొందరు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే టీఆర్ఎస్ సోషల్ మీడియా వర్కర్లు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలను కుక్కలుగా అభివర్ణించారు. రాజగోపాల్ రెడ్డి ట్వీట్ పై ఇటు వైరి వర్గాలతో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
Komatireddy Raj Gopal Reddy
BJP
Munugode
Congress
TRS
KCR
Revanth Reddy
Social Media

More Telugu News