reliance Jio: జియో, వొడాఫోన్ ఐడియా దీపావళి ఆఫర్లకు త్వరలోనే ముగింపు!

Jio and Vi are offering festive deals on recharge plans but the offers are ending soon
  • జియో దీపావళి సెలబ్రేషన్ ఆఫర్
  • రూ.2,999 రీఛార్జ్ ప్లాన్
  • ఏడాది వ్యాలిడిటీ, డైలీ రూ.2.5జీబీ డేటాతో ప్లాన్
  • వొడాఫోన్ ఐడియా నుంచి మూడు ప్లాన్లు
రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా దీపావళి సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్లు తర్వాత అందుబాటులో ఉండవు. కావాలనుకుంటే ఇప్పుడే వాటిని రీఛార్జ్ చేసుకోవచ్చు.

జియో రూ.2,999
రిలయన్స్ జియో స్పెషల్ దీపావళి సెలబ్రేషన్ ఆఫర్ ను ప్రకటించింది. దీనికింద రూ.2,999తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల పాటు వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే ఏడాది పాటు మళ్లీ రీఛార్జ్ చేసుకునే బాధ తప్పుతుంది. ఇందులో రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాల్స్ ఉచితం. రోజువారీ 2.5 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 75జీబీ డేటాను కూడా ఉచితంగా ఇస్తోంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా పొందొచ్చు.

వొడాఫోన్ ఐడియా రూ.1,449
180 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఇది. రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, రోజువారీ 1.5జీబీ ఉచిత డేటా, దీనికి అదనంగా మరో 50జీబీ డేటా లభిస్తుంది.
 
వొడాఫోన్ ఐడియా రూ.2,899
ఇది 365 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, 1.5జీబీ ఉచిత డేటా పొందొచ్చు. అదనంగా మరో 75జీబీ డేటా లభిస్తుంది. 

వొడాఫోన్ ఐడియా రూ.3,099
ఇది 365 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, 2 జీబీ ఉచిత డేటా పొందొచ్చు.అదనంగా 75జీబీ డేటా లభిస్తుంది. అలాగే, ఏడాది పాటు డిస్నీ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
reliance Jio
vodafone idea
recharge offers
deepawali
diwali

More Telugu News