Kantara: రజనీకాంత్ ప్రశంసలతో పొంగిపోతున్న 'కాంతార' హీరో

Rishab Shetty feels happy with Rajinikanth appreciation on Kantara movie
  • అక్టోబరు 15న రిలీజైన కాంతార
  • వివిధ భాషల్లో సూపర్ హిట్ 
  • పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న రిషబ్ శెట్టి
  • కాంతార చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్
  • గూస్ బంప్స్ వచ్చాయని వెల్లడి
కన్నడ చిత్రం 'కాంతార' కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతోంది. రిషబ్ శెట్టి హీరోగా స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార' పలు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లను దాటేసింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం పెద్ద సినిమాలను మించిపోయి సక్సెస్ ను సొంతం చేసుకుంది. 

కాగా, 'కాంతార' చిత్రాన్ని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వీక్షించి, అచ్చెరువొందారు. "తెలిసిన దానికంటే తెలియనిదే ఎక్కువ... అని హోంబలే ఫిలింస్ నిర్మించిన కాంతార చిత్రం కంటే మరెవరూ బాగా చెప్పలేరు. ఈ సినిమా చూశాక నాకు గూస్ బంప్స్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. నటుడిగానూ, రచయితగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ప్రతిభకు హ్యాట్సాఫ్. భారతీయ సినీ చరిత్రలో ఇదొక కళాఖండం అనదగ్గ చిత్రం. కాంతార చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలుపుతున్నాను" అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. 

దీనిపై 'కాంతార' దర్శకహీరో రిషబ్ శెట్టి పొంగిపోయారు. తలైవా ట్వీట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. "రజనీకాంత్ సర్... భారతదేశంలోనే మీరు అతిపెద్ద సూపర్ స్టార్. బాల్యం నుంచి  నేను మీకు అభిమానిని. కాంతార చిత్రాన్ని మీరు అభినందిచడంతో నా కల నిజమైనట్టుగా భావిస్తున్నాను. నేటివిటీ ఉన్న మరిన్ని లోకల్ కథలను తెరకెక్కించి, ప్రేక్షకులను అన్నివిధాలా ఉత్తేజితులను చేసేందుకు మీరు నాకు స్ఫూర్తిగా నిలిచారు... థాంక్యూ సర్" అని పేర్కొన్నారు.
Kantara
Rajinikanth
Rishab Shetty
Kannada
Pan India

More Telugu News