YSRCP: సీఎం జగన్ తో రోజా భేటీ.. నగరి అసమ్మతి వర్గంపై ఫిర్యాదు
- నగరి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా
- రోజాకు అసమ్మతిగా మారిన చక్రపాణి రెడ్డి వర్గం
- ఈ నెల 16న రోజాను పిలవకుండానే ప్రారంభోత్సవాలు చేసిన చక్రపాణి రెడ్డి
- ఘటనపై జగన్ కు ఫిర్యాదు చేసిన రోజా
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా బుధవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం నగరిలో తనకు అసమ్మతి వర్గంగా తయారైన పార్టీ నేతలపై ఆమె జగన్ కు ఫిర్యాదు చేశారు. నియోకజవర్గంలో తనను బలహీనపరిచే దిశగా అసమ్మతి నేతలు కార్యక్రమాలు చేపడుతున్నారని, ఫలితంగా పార్టీ పరువు పోతోందని ఆమె జగన్ కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల పార్టీ కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలాగైతే రాజకీయాలు చేయడం కష్టమేనంటూ రోజా చేసిన వ్యాఖ్యలు లీకైన సంగతి తెలిసిందే. ఈ నెల 16న రోజాకు సమాచారం ఇవ్వకుండానే నగరి పరిధిలో ఆర్బీకే, వెల్ నెస్ కేంద్రాలను అసమ్మతి నేతగా ఉన్న చక్రపాణి రెడ్డి వర్గం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న రోజా తన అనుచరులతో మట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపైనే ఆమె బుధవారం సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు.