Tammineni Sitaram: సీఎం జగన్ దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేశారు; స్పీకర్ తమ్మినేని సీతారాం

Assembly speaker Tammineni Sitaram heaps praise on CM Jagan
  • తాడేపల్లిలో వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం
  • హాజరైన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం
  • సీఎం జగన్ ను సంఘ సంస్కర్తగా అభివర్ణించిన వైనం
  • జగన్ చరిత్రలో నిలిచిపోతారని కితాబు
తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ బీసీల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేశారని కొనియాడారు. బీసీలు, ఇతర వెనుకబడిన వర్గాల రాజకీయ, ఆర్థిక సాధికారత కోసం పాటుపడుతున్న సీఎం జగన్ గొప్ప సంఘసంస్కర్తగా చరిత్రలో నిలిచిపోతారని తమ్మినేని తెలిపారు. 

ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం వైసీపీ చేసింది ప్రారంభం మాత్రమేనని అన్నారు. సీఎం జగన్ దార్శనికతతో కూడిన నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నేతలపై ఉందని స్పష్టం చేశారు.
Tammineni Sitaram
Jagan
BC
YSRCP
Andhra Pradesh

More Telugu News