Bihar: బీజేపీ కాదు.. ఆరుగురు ముఖ్యమంత్రులు ఆర్థిక సాయం చేస్తున్నారు: ప్రశాంత్ కిశోర్

6 CMs and former clients lending financial aid for Jan Suraaj says Prashant Kishor
  • బీహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిశోర్
  • ఈ యాత్రకు బీజేపీ ఆర్థిక సాయం అందిస్తోందంటూ జేడీయూ అనుమానాలు
  • అలాంటిదేమీ లేదని కొట్టిపడేసిన పీకే
తాను చేపట్టిన ‘జన్ సురాజ్’ ఉద్యమానికి బీజేపీ ఆర్థిక సాయం అందిస్తోందన్న ఆరోపణలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) స్పందించారు. తనకు బీజేపీ డబ్బులు ఇవ్వడం లేదని, ఆరుగురు ముఖ్యమంత్రులు ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిపారు. తన సంస్థ ‘ఐ ప్యాక్’ నుంచి గతంలో సేవలు పొందిన వారు ఇప్పుడు తనకు అండగా ఉంటున్నారని, వారిలో ఆరుగురు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలన్న లక్ష్యంతో ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. నిన్న ఈ యాత్ర నేపాల్ సరిహద్దులోని వాల్మీకినగర్ చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తనకు ఆర్థిక సాయం చేస్తుండొచ్చంటూ జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ వ్యక్తం చేసిన అనుమానాలపై స్పందించారు. అలాంటిదేమీ లేదని, గతంలో తన సంస్థ ద్వారా సేవలు పొందిన వారే ఇప్పుడు తనకు అండగా ఉన్నారంటూ పీకే స్పష్టతనిచ్చారు.
Bihar
Prashant Kishor
Jan Suraaj
BJP
JDU

More Telugu News